ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP TET : అక్టోబరు 3 నుంచి టెట్‌

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:14 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

  • వచ్చే నెల మూడో తేదీ వరకు దరఖాస్తులు

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబరు 22 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి తెస్తారు. ఒక్కో పరీక్ష ముగిసిన వెంటనే 4వ తేదీ నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు.

5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. 27న తుది కీ విడుదల చేసి, నవంబరు 2న ఫలితాలు విడుదల చేస్తారు. సోమవారం పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూలు మినహా మిగిలిన నిబంధనలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నెల 2వ తేదీన టెట్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే మూడు నెలల గడువు ఇవ్వాలని అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం షెడ్యూలులో మార్పులు చేసింది.

Updated Date - Jul 09 , 2024 | 11:33 AM

Advertising
Advertising
<