ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

ABN, Publish Date - Jun 18 , 2024 | 04:33 AM

కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

మాజీ సీఎంపైనా ఫర్నిచర్‌ దొంగతనం కేసు పెట్టాలి

టీడీపీ నేతల డిమాండ్‌.. వైసీపీ సమర్థనలపై ఆగ్రహం

అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీ ఫర్నిచర్‌ కోడెల క్యాంపు ఆఫీసులో

ప్రభుత్వం మారాక దానిని తీసుకెళ్లాలని లేఖ

ధర చెల్లిస్తాననీ లెటర్‌.. ఆ తర్వాత స్పీకర్‌కూ సమాచారం

వాటన్నిటినీ పక్కనపెట్టి మాజీ స్పీకర్‌పై దొంగతనం కేసు

నాడు మాజీ స్పీకర్‌పై ‘దొంగ’ ముద్ర వేశారు

నేడు మాజీ సీఎంపైనా ఫర్నిచర్‌ దొంగతనం కేసు పెట్టాలి

టీడీపీ నేతల డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావును ఫర్నిచర్‌ దొంగగా ముద్ర వేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జగన్‌ను సమర్థిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘జగన్‌ గతం మరచిపోయారా? కోడెల చేస్తే తప్పయింది ఆయన చేస్తే ఒప్పవుతుందా? జగన్‌ మీద కూడా ఫర్నిచర్‌ దొంగతనం ఎందుకు పెట్టకూడదు’ అన్న ప్రశ్నలు టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అప్పటిదాకా స్పీకర్‌గా పనిచేసిన కోడెలపై వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ఫర్నిచర్‌ దొంగతనం చేశారని కేసు మోపింది. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారు. వివాదంలో ఉన్న ఫర్నిచర్‌ హైదరాబాద్‌లో ఉమ్మడి అసెంబ్లీకి సంబంధించింది. ఏపీ వాటాగా అందులో కొంత ఫర్నిచర్‌ను నిర్ధారించి దానిని లారీల్లో అమరావతికి పంపారు. పెద్ద పెద్ద టేబుళ్లు, పాత కుర్చీలు అందులో ఉన్నాయి. అప్పటికే అమరావతిలోని అసెంబ్లీలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌ను సమకూర్చుకున్నారు. కొత్త అసెంబ్లీలో పెట్టడానికి ఖాళీ లేకపోవడంతో వాటిని తన క్యాంపు కార్యాలయంలో పెడితే వాడుకుంటానని కోడెల చెప్పారు. దాంతో అక్కడకు పంపారు. 2019 ఎన్నికల్లో టీడీపీతోపాటు కోడెల కూడా ఓడిపోయారు. జూన్‌ 3న కోడెల అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేసి తన క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ ఉందని చెప్పారు. దీని కొనసాగింపుగా 7న అసెంబ్లీ కార్యదర్శికి ఒక లేఖ పంపారు. పాత ఫర్నిచర్‌కు రేటు నిర్ణయిస్తే దానిని చెల్లించి తానే ఉంచుకుంటానని అందులో పేర్కొన్నారు. కానీ ప్రత్యుత్తరం రాలేదు. ఆగస్టు 20న కోడెల కొత్త స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు మరో లేఖ రాశారు. ఈ లేఖ అందినట్లుగా స్పీకర్‌ కార్యాలయం సిబ్బంది సంతకం కూడా చేశారు. తర్వాత ఈ లేఖలు పక్కన పడవేసి అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల దొంగతనం చేశారంటూ కేసు నమోదు చేశారు. అవమానంతో కుంగిపోయిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం తనపై ఫర్నిచర్‌ దొంగతనం మోపడంతోనే ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపించారు. కోడెల తన క్యాంపు కార్యాలయంలో వాడుకొన్న పాత ఫర్నిచర్‌ మొత్తం విలువ రూ. 2లక్షలకు మించదని అప్పట్లో అసెంబ్లీ వర్గాలు లెక్కగట్టాయి. కోడెల రాజకీయాల్లోకి రాక ముందే బాగా ఆస్తిపరుడు. నరసరావుపేటలో బాగా పేరున్న వైద్యుడు. ఆయన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుండేది. అంత ఆస్తిపరుడిపై ఫర్నిచర్‌ దొంగతనం కేసు మోపడం టీడీపీ వర్గాలను కలచివేసింది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి జగన్‌కు ఎదురైంది. సీఎంగా ఉన్న సమయంలో ఆయన తన తాడేపల్లి ప్యాలె్‌సలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఆ ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఆ ఫర్నిచర్‌ ధర ఎంతో చెబితే చెల్లిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరిట ప్రకటన వెలువడింది. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ‘అప్పుడు కోడెలపై ఏం కేసు పెట్టారో ఇప్పుడు జగన్‌పై కూడా అదే కేసు పెట్టాలి’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 18 , 2024 | 07:02 AM

Advertising
Advertising