ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: సురేష్‌పై ప్రేమతో పరామర్శించలేదు: గురునాథం

ABN, Publish Date - Sep 13 , 2024 | 06:37 PM

వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్‌ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని ..

TDP Leader Gurunatham

అమరావతి, సెప్టెంబర్ 13: వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్‌ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని బెదిరించటానికి వెళ్లాడని ఆరోపించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తన స్వార్థ రాజకీయం కోసం తనని వాడుకున్నాడని తెలుసుకున్న నందిగామ సురేష్ అప్రూవర్‌గా మారనున్నారని అన్నారు.


జగన్‌కి తన దూతల ద్వారా సందేశం పంపిస్తే.. ఆగమేఘాల మీద జగన్ పరుగెత్తుకుంటూ వచ్చాడని గురునాథం వ్యాఖ్యానించారు. నందిగం సురేష్ మరో దస్తగిరి అవుతాడనే భయంతోనే జగన్ జైలుకు పరుగులు పెట్టారన్నారు. రాజధాని అమరావతి నాశనానికి పథక రచయిత తానే అనే పేరు ఎక్కడ బయటపెడతాడో అనే భయం జగన్‌లో మొదలైందన్నారు. నందిగం సురేష్ నిజాలు బయటపెడితే చంపివేస్తాడనే భయం ఆయన కుటుంబ సభ్యుల్లో ఉందని గురునాథం వ్యాఖ్యానించారు.


టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులోనే నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పునిచ్చింది. రెండు రోజుల పాటు సురేష్‌ను విచారించేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు విచారించే అవకాశం కల్పించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా నందిగం సురేష్ ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సురేష్‌ను విచారించేందుకు అనుమతించారు.


Also Read:

మంచి ఉద్యోగం, ఆశించిన జీతం.. సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

పేరు మారిన 'పోర్ట్ బ్లెయిర్'

వైసీపీకి షాక్.. ఇది కూడా చేజారిపాయే..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 13 , 2024 | 06:58 PM

Advertising
Advertising