TDP Leaders : క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది టీడీపీనే
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:54 AM
క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భవన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు
అమరావతి, డిసెంబర్ 20(ఆంధ్రజ్యోతి): క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ కేక్‌ను కత్తిరించి ఏసు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. ‘అన్ని మతాలనూ సమానంగా గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సర్వ మత స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి క్రైస్తవులను మోసం చేస్తే, టీడీపీ ప్రభుత్వం క్రైస్తవులకు నిండు హృదయంతో సాయం చేస్తోంది. ఏసు ప్రభువు ఇచ్చిన నియమాల్లో ఏ ఒక్కదానినీ జగన్ ఆచరించలేదు’ అని నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. మంచి సమాజం కోసం పాటుపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలని క్రైస్తవ సమాజం ప్రార్ధించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల జోసెఫ్, టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామిదాసు, పలువురు బిష్‌పలు, పాస్టర్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 03:56 AM