ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ‘వాళ్లు ఎంతటి దుర్మార్గులో నాకు తెలుసు’.. రఘురామ సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Jun 13 , 2024 | 01:33 PM

Andhra Pradesh News: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్‌కు రఘురామకృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను కొట్టారని విజయసాయి రెడ్డి ఢిల్లీలో హంగామా చేశారని..

TDP MLA Raghu Rama Krishnam Raju

పశ్చిమగోదావరి, జూన్ 13: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్‌కు రఘురామకృష్ణం రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమను కొట్టారని విజయసాయి రెడ్డి ఢిల్లీలో హంగామా చేశారని.. వాస్తవానికి వాళ్లు ఎంతటి దుర్మార్గులో తనకన్నా తెలిసిన వారు ఎవరూ లేరని రఘురామ అన్నారు. తన నియోజకవర్గంలో కనీసం తన ఫ్లెక్సీని కూడా కట్టనివ్వలేదన్నారు.


గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ఏమీ జరగకుండానే వాళ్లు చేసింది.. వీళ్లు చేస్తారేమోనని భయపడి.. కొట్టేస్తున్నారు.. చంపేస్తున్నారు అని అంటున్నారు’ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఇద్దరు వ్యక్తలు కొట్టుకుంటే దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి చంపేస్తూన్నారని హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పందాలు కాసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని.. దానిని వైసీపీ ప్రభుత్వం రాలేదని చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ ఆత్మహత్యలకు జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమో అంటూ రఘురామ సెటైర్లు వేశారు. అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వెయ్యకపోతే ఇంత పెద్ద విజయం రాదని.. అంత పెద్ద విజయం అందడంలో క్షత్రియుల పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు. క్షత్రియులకు ఎవరో ఒకరికి ఎదో ఒక పదవి ఇస్తారని అనుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 13 , 2024 | 01:33 PM

Advertising
Advertising