Lavu sri krishna devarayalu: నాకు, ఆ ఎస్పీ కుటుంబానికి బంధుత్వం లేదు...
ABN, Publish Date - May 20 , 2024 | 12:55 PM
Andhrapradesh: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్‌కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు.
అమరావతి, మే 20: పల్నాడు అల్లర్లపై (Palnadu riots) సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు (TDP MP candidate Lavu Srikrishna Devarayalu) కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్‌కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు. అవసరం అయితే కాల్ డేటా సిట్ అధికారులు పరిశీలించాలన్నారు. ‘‘పల్నాడు అల్లర్లపై నా ప్రమేయం ఉంటే నా పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టుకోవచ్చు’’ అని తెలిపారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయని చెప్పినా అక్కడ ఒక కానిస్టేబుల్‌ను మాత్రమే ఉంచారని లావు కృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా
మరోవైపు.. ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. రెండు రోజుల పాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం,ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి....
AP Elections 2024: మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన గెలుస్తారా..!?
Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..
Read Latest AP News AND Telugu News
Updated Date - May 20 , 2024 | 02:13 PM