ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. ఎందుకంటే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 06:08 PM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు..

Lavu Sri Krishna Devarayalu

అమరావతి, అక్టోబర్ 16: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ - జాతీయ రహదారి (NH-16)కి ఇరువైపులా కుప్పగంజి వాగు నుండి వోగేరు వాగు వరకు (సుమారు 8 కి.మీ) అవుట్‌ఫాల్ డ్రైన్‌ల నిర్మాణం కోసం ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ లావు కృష్ణదేవరాయలు కోరారు. ఈ అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.


కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోడ్లు ఇవే..

- దుర్గి నుండి వెల్దుర్తి రోడ్డు.

- పాలువాయి జంక్షన్ నుండి సత్రశాల రహదారి (వయా పాశర్లపాడు, జెట్టిపాలెం రోడ్డు).

- మాచర్ల N. కొండ, గొట్టిపాళ్ల మీదుగా VP సౌత్ రోడ్.

- కండ్లకుంట & గుడిపాటి చెరువు నుండి లోయపల్లి-లచ్చమ్మబావి తండా రోడ్డు వరకు.

- అలాగే గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో 4-లేన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి రూ. 98 కోట్లను మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి కృతజ్ఞతలు తెలిపారు.


పల్నాడుకు మరో మహా రోడ్డు..

కొండమోడు - పేరేచర్ల జాతీయ రహదారికి రూ. 881.61 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 49.917 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ జాతీయ రహాదారి 4లైన్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ జాతీయ రహదారికి అనుబంధంగా సత్తెనపల్లి, మేదికొందూరుల వద్ద రెండు బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

Updated Date - Oct 16 , 2024 | 06:08 PM