ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ఎంపీ అప్పలనాయుడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 06 , 2024 | 09:56 PM

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో ఆయన గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో..

అమరావతి: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో ఆయన గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి 9మంది ఎంపీలు ప్రత్యక్షంగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు ఐదేళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని నిలబెట్టారని కొనియాడారు. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలంతా మంచి పనితీరుకనబరచి ప్రజల మన్ననలు పొందాలని హితవుపలికారు. సామాన్యమైన కార్యకర్త నుంచి చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.


కష్టపడి విధేయతతో ఉంటే పదవులు వస్తాయని.. దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. అప్పల నాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని.. అయితే కష్టపడి పనిచేసి, అందరినీ కలుపుకొని పోయి కలిశెట్టి గెలిచి చూపించారనన్నారు. అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాదని.. పార్టీలో సామాన్య కార్యకర్తలకు టిక్కెట్లు దక్కుతాయనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.


ఈ సందర్భంగా చంద్రబాబు అప్పలనాయుడుతో.. ‘‘అప్పల నాయుడూ నీ ఫ్లైట్ టిక్కెట్ ఉందా... తీసుకున్నావా.. లేదంటే చెప్పు మన వాళ్లు టిక్కెట్ బుక్ చేస్తారు’’ అని చంద్రబాబు ఆప్యాయంగా అడిగారు. ఇదిలావుండగా, ఎంపీల పట్ల చంద్రబాబు ప్రేమానురాగాలు కనబరచడంపై నాయకులంతా సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 06 , 2024 | 09:56 PM

Advertising
Advertising