TDP: ఊరికో మాట మాట్లాడుతున్న ఎంపీ మిధున్.. మీ ఆటలిక చెల్లవ్..
ABN, Publish Date - Jun 27 , 2024 | 12:17 PM
గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయామని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమి చేయలేకపోయారన్నారు.
తిరుపతి: గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయామని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమి చేయలేకపోయారన్నారు. ఎంపీ మిధున్ ఊరికో మాట మాట్లాడుతున్నారన్నారు. నిన్నటి దాకా బీజేపీని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని ఎలా చూడాలని చల్లా రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
అబ్బా కొడుకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వబోమన్నారు. మీ అవినీతి చిట్టా త్వరలోనే విప్పుతామన్నారు. తప్పుడు కేసులతో సామాన్యుని హింసించటాన్ని ఎవరూ క్షమించే పరిస్థితిలో లేరని చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఇవాళ చల్లా ఆధ్వర్యంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషాతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. చల్లా రామచంద్రారెడ్డి వ్యూహం విజయవంతమైంది. మరో వారంలోపు 25 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.
Updated Date - Jun 27 , 2024 | 12:28 PM