AP: ఎమ్మెల్యే చెంప చెళ్లుమంది
ABN, Publish Date - May 14 , 2024 | 03:53 AM
వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు.
వరుసలో రండి.. అన్నందుకు ఓటరు చెంపపై
కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని
అంతే దీటుగా బదులిచ్చిన ఓటరు
ఆయన్ను చితగ్గొట్టిన ఎమ్మెల్యే అనుచరులు
ఈసీ ఫైర్.. ఎమ్మెల్యే గృహ నిర్బంధానికి ఆదేశం
తెనాలి పోలింగ్ బూత్‌లో ఓటరు చెంపపై కొట్టిన తెనాలి ఎమ్మెల్యే
అంతే దీటుగా బదులిచ్చిన ఓటరు
తెనాలి, మే 13, (ఆంధ్రజ్యోతి): వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. తెనాలి పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడమే పాపమైంది. అంతే... వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో పోలిం గ్ ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగుచెందారు. అదే వరుసలో ఎన్నారై గొట్టిముక్కల సుధాకర్ ఉన్నారు. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుటుంబమే కాకుండా, ఆయన అనుచరులు పదిమందికిపైగా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండడంతో సుధాకర్ వారిని వరుసలో రావాలని కోరారు. దీంతో సుధాకర్‌కు, ఎమ్మెల్యే అనుచరులకు వాదనలు సాగాయి.
ఈలోపే ఎమ్మెల్యే శివకుమార్ వేగంగా అక్కడకు వచ్చి సుధాకర్ చెంపపై కొట్టడం, సుధాకర్ కూడా అంతే వేగంగా ఎమ్మెల్యే చెంపపై కొట్టడం కనురెప్పపాటులో జరిగిపోయాయి. ఆ వెంటనే శివకుమార్ అనుచరులు సుధాకర్‌పై దాడికి దిగారు. కంటిపై, ముఖంపై గాయాలైన సుధాకర్ అక్కడున్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కొద్దిసేపటికి పోలీసులు ఓటువేయించి స్టేషన్‌కు సుధాకర్‌ను తీసుకువెళుతుండగా, మరోసారి ఎమ్మెల్యే అనుచరులు దారుణంగా కొట్టారు. ఆ తర్వాత సుధాకర్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ఇద్దరిపైనా కేసులు నమోదుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
Updated Date - May 14 , 2024 | 03:53 AM