ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Mega DSC 2024: టెట్, డీఎస్సీకి కొత్త తేదీలు.. ఎందుకంటే..?

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:44 PM

అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్, డీఎస్పీకి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లో టెట్ తర్వాత 90 రోజుల్లో డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

Mega DSC

అమరావతి: అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్, డీఎస్పీకి (Mega DSC) మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లో టెట్ తర్వాత 90 రోజుల్లో డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. వెంటనే నియామక ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని అభ్యర్థన వచ్చింది. ఆ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.


సమయం ఇచ్చేందుకు ఓకే..

టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకి సన్నద్ధం అయ్యేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభిప్రాయాలు తీసుకున్న తరువాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవడానికి టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణకు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.


ఫీజు మినహాయింపు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రద్దు చేసిన డీఎస్పీలో దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్పీలో ఫీజు మినహాయింపు ఉంటుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అదేవిధంగా టెట్ సిలబస్ మార్పు చేయడం లేదని.. ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్ కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Congress: రాజ్యసభ నుంచి వాకౌట్‌పై ఖర్గే స్పష్టత..

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 05:44 PM

Advertising
Advertising