Kurnool: వందశాతం అధికారం చంద్రబాబుదే.. స్పష్టం చేసి టీజీ వెంకటేశ్
ABN, Publish Date - May 10 , 2024 | 02:29 PM
అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) స్పష్టం చేశారు.
కర్నూలు: అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్(CM Jagan) అసమర్థ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కి తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ హక్కుల సాధనే లక్ష్యంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను ప్రారంభించా. రాయలసీమలో సమ్మర్, వింటర్ క్యాపిటల్, మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు.
కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదు. మొదటగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత హైకోర్టు కోసం పోరాడవచ్చని చెప్తున్నా. చంద్రబాబు అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి రాకముందే రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే అడుగుతున్నా. గత ఎన్నికల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసి ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి.
అలాగే మరికొన్ని రిజర్వాయర్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్‌లు కట్టాలి. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. సిద్దేశ్వరం ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. జగన్ హయాంలో కాలువల ద్వారా చెరువులు నింపలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీటిని రాయలసీమ జిల్లాలకు ఇవ్వండి. ఓర్వకల్లు మండలంలో, కర్నూలు శివారులోని జగన్నాథ గుట్టపై 30 వేలకు పైగా ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా కాపాడాను. చంద్రబాబు సీఎం అయ్యాక హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేస్తారని ఆశిస్తున్నా" అని వెంకటేష్ పేర్కొన్నారు.
AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 02:29 PM