Pawan Kalyan: అన్ని అనర్ధాలకు ఆ ఐఏఎస్సే కారణం..
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:36 PM
సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్‌పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన పంచాయతీ రాజ్ కార్యాలయానికి వచ్చారు. రూరల్ డెవలప్‌మెంట్‌పై పవన్ సమీక్ష నిర్వహించారు.
అమరావతి: సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్‌పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన పంచాయతీ రాజ్ కార్యాలయానికి వచ్చారు. రూరల్ డెవలప్‌మెంట్‌పై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారిందన్నారు. మన దేశం నదులు, సంప్రదాయాలు, పూజలకు విలువ ఇస్తామని.. కానీ నదుల సంరక్షణకు చర్యలు తీసుకోబోమన్నారు. పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారని.. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. వాటిని తిని గోవులు చనిపోతున్నాయన్నారు.
‘‘గోవులను పూజించడమే కాదు.. వాటి బాగు కూడా చూడాలి. మనకి పనికిరాని వస్తువులతో సంపద సృష్టింవచ్చు. చెత్త ను ఊడ్చి పడేయటం వరకే... తరువాత ఏమిటి అని ఆలోచన చేయడం లేదు. పిఠాపురంలో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. రోజుకు రెండు సార్లు చెత్త కలెక్ట్ చేసి.. కొత్త సంపద సృష్టిస్తాం. ప్రజలు కూడా దీనిని బాధ్యత తీసుకుని సహకరించాలి. పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో అన్ని కాలనీల్లో అమలు చేస్తాం. మాస్టర్ ట్రైనర్స్‌ను ముందు రెడీ చేసి.. వాళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం శిక్షణ ఇస్తాం. ఇది వ్యక్తి తో మొదలైనా... వ్యవస్థ మొత్తం అమలు చేయాలి. నా పార్టీ ఆఫీస్, నా క్యాంపు ఆఫీస్, నా నియోజకవర్గంలో నేను మొదలు పెడతా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొన్ని మార్పులు తీసుకు వస్తాం
పంచాయతీ ల ద్వారా మోటివేషన్ తీసుకు వస్తాం. 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్లు ఆదాయం సమకూరింది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతాం. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులు కు కేటాయిస్తాం. బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం. గ్రామాల్లో రోడ్డు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటాం. పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదగాలి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని పరిష్కారాలు ఒకేసారి అయిపోవు. ఈ ప్రాజెక్టును ముందు అమలు చేసి.. ఫలితాల చూసి.. అన్నిచోట్ల అమలు చేస్తాం. దీనికి కమ్మిట్మెంట్ ఉండే లీడర్ షిప్ ఉంటేనే ఇది సాధ్యం. పిఠాపురం లో 54 పంచాయతీ ల్లో మేము చేసేది చేయగా.. యన్ఆర్ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటాం’’ అని పవన్ పేర్కొన్నారు.
ఆయనే మూల కారణం అంటున్నారు..
సర్వీస్ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. అన్ని అనర్ధాలకు ఒకే ఐఏయస్ కారణం. ఏ సమీక్ష చేసినా... ఆయనే మూల కారణం అంటున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేసింది. 70+30 నిధులు ఇస్తే పని అయ్యేది.. అది జరగలేదు. రకరకాల పేర్లు చెప్పి నిధులు మొత్తం మళ్లించారు. ముందు ఖర్చు పెట్టండి, తరువాత బిల్లు ఇస్తాం అని నమ్మబలికారు. డబ్బులు వచ్చినా.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌లకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని వ్యవస్థ ల్లో, పథకాల్లో ఇటువంటి ఛాలెంజ్‌లు ఉన్నాయి. వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ చేయాలంటే మాకు సాధ్యం కాదు కదా’’ అని పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Landslides: కొండచరియలు విరిగిపడి, నదిలో పడ్డ 2 బస్సులు.. 63 మంది గల్లంతు
Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
Read Latest AP News AND Telugu News