AP Bhavan: ఎట్టకేలకు వీడిన ఏపీ భవన్ విభజన పీటముడి
ABN, Publish Date - Mar 16 , 2024 | 02:03 PM
Andhrapradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ భవన్‌ను విభజన చేస్తూ శనివారం కేంద్రం హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 16: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ (AP Bhavan) విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ భవన్‌ను విభజన చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ (Union Home Ministry) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది. ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు.. ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
ఇవి కూడా చదవండి...
MP Avinash: నెక్ట్స్ టార్గెట్ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్..?
TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 16 , 2024 | 02:12 PM