Budget 2024: పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపులపై నిర్మలమ్మ మరింత స్పష్టత
ABN, Publish Date - Jul 23 , 2024 | 07:29 PM
కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయించడం జరిగింది. రూ. 15వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై మరింత స్పష్టత ఇచ్చారు...
అమరావతి/న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయించడం జరిగింది. రూ. 15వేల కోట్లు ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై మరింత స్పష్టత ఇచ్చారు.
సాయం చేస్తాం..!
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు
పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
సమావేశాల అనంతరం మీడియా మీట్‌లో ఏపీకి ఇచ్చిన నిధులపై ఫుల్ క్లారిటీ
కేంద్ర బడ్జెట్‌లో పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపుపై..
మరింత స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
విభజన చట్టంలోనే రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని ఉంది
ఆ మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తప్పనిసరిగా సాయం చేయాలి
మాట్లాడి.. ఆ తర్వాతే!
బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాం
దానికి మరింత అదనపు నిధుల జోడింపు కూడా ఉంటుంది
దానికి తిరిగి చెల్లింపులు ఎలా అనేది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తం ఎలా చెల్లించాలన్నది ఇంకా చర్చించాల్సి ఉంది
ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే..
వాళ్ల వాటాను తిరిగి చెల్లించగలరా లేదా అన్నది వారితో మాట్లాడి చేస్తాం
వాళ్ల వాటా కూడా కేంద్రం నుంచి గ్రాంట్ ఇస్తామా..? అనేది ఏపీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం
మాటిచ్చాం.. నెరవేరుస్తాం!
రాష్ట్రానికి రాజధాని లేకుండా పది సంవత్సరాలు వెళ్లిపోయాయి
దేశంలో రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఉంది అంటే... అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈపాటికే అక్కడ రాజధాని నిర్మాణమై ఉండాలి
ఇప్పటి వరకు అమరావతికి ఎవరు ఏం చేశారో, ఏం చేయలేదనే వివరాల్లోకి వెళ్లను
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది
కొత్త విషయాలు..!
పోలవరం జాతీయ ప్రాజెక్టు.. దాని నిర్మాణం కేంద్రం బాధ్యత
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు.. ఏపీ ప్రభుత్వమే నిర్మిస్తోంది
అలా రాష్ట్రమే నిర్మాణం చేసేందుకు 2014లో అంగీకరించాం
నిర్మాణం, పునరావాస వ్యయాలపై అప్పుడు ప్రాథమిక అంగీకారం కుదిరింది
ఆమేరకు ప్రాజెక్టు వ్యయాలపై క్యాబినెట్ నుంచి అనుమతి తీసుకున్నారు
ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కొత్త విషయాలు చర్చకు వచ్చాయి
ప్రాజెక్టు ఎత్తును బట్టి నిర్వాసితుల పరిహారం ఎంత అనేది ఆధారపడి ఉంది
కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులను అందించి తీరుతాం
ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికీ కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి
అవును.. జాతీయ ప్రాజెక్టే!
ప్రస్తుతం సమస్యల వివరాల్లో వెళ్లదలుచుకోవడం లేదు
ఇప్పటికీ చెబుతున్నాం.. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు
పోలవరం జాతీయ ప్రాజెక్టు మాది అని కేంద్ర ప్రభుత్వే అంగీకరించింది
ఆ మేరకు పోలవరం పూర్తికి ఎంత అవసరమో అంతా చేయాల్సిందే
పోలవరానికి ఎంత ఖర్చు అయినా, ఎలా తెచ్చినా అది కేంద్రం బాధ్యత
కేబినెట్ ఎంత ఆమోదించిందో అంత మేరకు ఇప్పుడు నిధులు ఇస్తున్నాం
ఇబ్బందులు అధిగమించి ప్రాజెక్టు పూర్తికి ఎంత అవసరమో చర్చిస్తాం
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఆ మేరకు ప్రాజెక్టు పూర్తికి మద్దతు ఇస్తాం : నిర్మలా సీతారామన్
Updated Date - Jul 23 , 2024 | 07:30 PM