ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: ఏపీ డీజీపీకి వర్లరామయ్య లేఖ.. ఏమన్నారంటే..?

ABN, Publish Date - Mar 11 , 2024 | 07:32 PM

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) సోమవారం నాడు లేఖ రాశారు. నారా లోకేష్ (Nara Lokesh) కళ్యాణదుర్గం, రాయదుర్గం శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడ్డారు.

అమరావతి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) సోమవారం నాడు లేఖ రాశారు. నారా లోకేష్ (Nara Lokesh) కళ్యాణదుర్గం, రాయదుర్గం శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడ్డారు. భద్రతా ఏర్పాట్లు కల్పించాలని పోలీసులను ముందుగానే కోరినా కావాలనే విస్మరించారని అన్నారు. సభకు విచ్చేసిన అశేష ప్రజానీకం తోసుకోవడంతో లోకేష్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది రాంబాబు గాయాలపాలయ్యారని తెలిపారు.

లోకేష్ యువగళం పాదయాత్రకు సైతం సరైన భద్రత కల్పించలేదని అన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం సభా ప్రాంగణాలకు సమీపంలో ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. భద్రతా లోపాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు గతంలో ఇచ్చినా పోలీసు అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడటం లేదని చెప్పారు. ప్రతిపక్ష నాయకులకు భద్రతా కల్పించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు రాబోతున్న తరుణంలోనైనా తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని వర్ల రామయ్య లేఖలో విన్నవించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 07:32 PM

Advertising
Advertising