ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: 175 స్థానాల్లో కచ్చితంగా విజయం మాదే.. విజయసాయిరెడ్డి ధీమా..

ABN, Publish Date - Feb 28 , 2024 | 05:28 PM

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అధికార వైసీపీ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటించనుంది.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అధికార వైసీపీ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటించనుంది. ఈ మేరకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకోవడం సహజమేనన్న ఆయన.. మొదటి నుంచి వైసీపీ పొత్తులు లేకుండా పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో మార్చి 3న జరగాల్సిన సిద్దం ఆఖరి మహాసభను మార్చి 10న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయని విజయసాయిరెడ్డి వివరించారు. నాలుగో సిద్దం మహాసభ నిర్వహణ కోసం మేదరమెట్ల వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

"సిద్దం సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాం. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయని ఊహిస్తున్నాం. 175 స్థానాల్లో విజయం కచ్చితంగా సాధిస్తాం. అన్ని నియోజక వర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు." అని విజయసాయిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 05:28 PM

Advertising
Advertising