ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు..

ABN, Publish Date - Aug 07 , 2024 | 10:50 AM

బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. తిరగబడిన యువతి తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

విశాఖ: బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. తిరగబడిన యువతి తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. మంగళవారం అర్ధరాత్రి 2గంటలకు రైలు సామర్లకోట స్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో అందరూ నిద్రస్తుండగా ఓ వ్యక్తి యువతి దగ్గరకు మెల్లిగా వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ మెలకువగా లేకపోవడంతో ఆమెను తాకడం మెుదలుపెట్టాడు.


లైంగిక దాడికి ప్రయత్నించే సమయంలో యువతి ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. గట్టిగా కేకలు వేసి దుండగుడిపైకి తిరగబడింది. విద్యార్థిని అరుపుల విన్న తోటి ప్రయాణికులందరూ లేచారు. యువతి విషయాన్ని వారికి చెప్పగా అందరూ కలిసి కామాంధుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని చితకబాదారు. తెల్లవారుజామున 5గంటలకు ట్రైన్ విశాఖపట్నం చేరుకోగా నిందితుణ్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణికులు అంతా ఉలిక్కిపడ్డారు.


మహిళలపై దేశవ్యాప్తంగా లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడా వారికి రక్షణ లేకుండా పోతోంది. పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ల సహా పలు ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్న వారిని సైతం అత్యాచారం, హత్యాచారాలు చేస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మైనర్లు సైతం తామేమీ తీసిపోలేదు అన్నట్లుగా ఘోరమైన దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఉదంతాలు రోజూ మన కళ్ల ఎదుట కనిపిస్తూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక దాడులను నివారించేందుకు చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని, నేరస్థులకు కఠిన శిక్షలు విధించి మరొకరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి:

Pawan Kalyan: సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..

Updated Date - Aug 07 , 2024 | 11:00 AM

Advertising
Advertising
<