Anakapalli: గంజాయిపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం..
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:22 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి: జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వి.మాడుగుల, కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో 448 కేజీల గంజాయి, రెండు కేజీల లిక్విడ్ గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ లారీ, బొలెరో వాహనం, కారు, ద్విచక్రవాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన మత్తుపదార్థాల విలువ రూ.21లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందిన వారి కాగా, ఒకరు చింతపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేసి ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా వారినీ అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ గంజాయి వంటి మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ హయాంలో ఏపీ గంజాయికి హబ్‌గా మారింది. దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి పట్టుపడినా దాని మూలాలు మాత్రం ఏపీలో తేలేవి. వైసీపీ నేతలే గంజాయి పండించి, సరఫరా చేస్తున్నారని కూటమి నేతలు అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు చేశారు. యువతను మద్యం, గంజాయికి బానిసలుగా మార్చేశారని ధ్వజమెత్తారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఏపీలో మత్తుపదార్థాలు సమూలంగా లేకుండా చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దాని దిశగా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి పండించినా, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గంజాయి సరఫరా దారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్న అనుమానం వచ్చినా దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు.
ఇవి కూడా చదవండి...
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు స్థల వివాదం
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు స్థల వివాదం
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 29 , 2024 | 04:25 PM