Anitha: పరిశ్రమల భద్రతపై చర్యలు తీసుకుంటాం.. మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 23 , 2024 | 11:31 AM
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగ్రాతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ... మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
విశాఖపట్నం: పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగ్రాతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ... మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఒక కమిటీ వేసి, పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖపట్నంలో ఎల్జీపాలిమర్స్ లాంటి ఘటన జరిగిందని చెప్పారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఉందని చెప్పారు. ఆ ప్రమాద బాధితులను వైసీపీ ప్రభుత్వం అండగా లేదని మంత్రి అనిత వెల్లడించారు.
Updated Date - Aug 23 , 2024 | 11:35 AM