ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Road Accident: అరకులోయ రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

ABN, Publish Date - Mar 09 , 2024 | 11:31 AM

Andhrapradesh: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా, మార్చి 9: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Arakuloya Road Accident) మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మిగిలిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అరకులోయ - లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్‌ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు సింహాద్రి అనే యువకుడు మరణించాడు. మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాధ్ (32 ), భార్గవ్ (4)లు గుర్తించారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రమాదం చోటు చేసుకోవడం.. ఐదుగురు మృతి చెందడంతో అరకులోయ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి...

Accident: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

AP News: టీడీపీ-జనసేన-బీజేపీ దోస్తీపై నేడు అధికారిక ప్రకటన!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 11:31 AM

Advertising
Advertising