Purandeshwari: ఏపీలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయి..
ABN, Publish Date - Feb 27 , 2024 | 03:48 PM
Andhrapradesh: ఎన్నికల కోసం సన్నాహం.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నహాల నేపథ్యంలో భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. జిల్లాలో జరిగిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీల కన్నా భిన్నమన్నారు. అధికారాన్ని సేవ భావం కోసం వినియోగిస్తున్నామన్నారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 27: ఎన్నికల కోసం సన్నాహం.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నహాల నేపథ్యంలో భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. జిల్లాలో జరిగిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీల కన్నా భిన్నమన్నారు. అధికారాన్ని సేవ భావం కోసం వినియోగిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ 2040 ఆవిష్కరించాలని చూస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రైవేటు పరం చేయడం కన్నా దాన్ని ఏ విధంగా లాభాల్లో తీసుకురావాలో ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైల్వే జోన్‌కు భూమి కేటాయించకుండా కేంద్ర అధినాయకత్వంపై నిందలు వెయ్యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని ఆశీర్వదిస్తే మంచి నిర్ణయాలు వస్తాయన్నారు. ఆంధ్రాలో ఒకసారి కేంద్రంలో మరోసారి అనేది బీజేపీ నినాదమని పురందేశ్వరి పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 27 , 2024 | 05:05 PM