మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. ఆఫీస్ నిండా అవే..

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:51 PM

పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..

AP Politics: అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. ఆఫీస్ నిండా అవే..
AP Politics

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20: పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌(MLA Annam Reddy Adeep Raj) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేయనున్నారు. కాగా, క్షేత్రస్థాయిలో వాతావరణం తమకు ఏమాత్రం అనుకూలంగా లేదని గుర్తించిన వైసీపీ నాయకులు ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ఇప్పటికే డబ్బులతో పాటు మహిళలకు చీరలు, కుంకుమ భరిణెలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెందుర్తి అభ్యర్థి అదీప్‌రాజ్‌ కార్యాలయంలో చీరలు దొరికాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 01:51 PM

Advertising
Advertising