ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anagani: వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు: మంత్రి అనగాని..

ABN, Publish Date - Dec 17 , 2024 | 09:40 PM

ఎన్డీయే ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండవని, చట్టపరంగా మాత్రమే చర్యలు ఉంటాయని మంత్రి అనగాని చెప్పారు. పంచ గ్రామాల సమస్య, 22-ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని మంత్రి చెప్పారు.

AP Revenue Minister Satya Prasad

విశాఖ: గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం, విసన్నపేట ఫ్రీ హోల్డ్, భూ అక్రమాలపై సీఐడీ విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌పై ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు తెలుస్తోందని మంత్రి చెప్పారు. దీంట్లో అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిస్తే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. విశాఖలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో మంత్రి అనగాని పాల్గొన్నారు.


ఎన్డీయే ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండవని, చట్టపరంగా మాత్రమే చర్యలు ఉంటాయని మంత్రి అనగాని చెప్పారు. పంచ గ్రామాల సమస్య, 22-ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని మంత్రి చెప్పారు. 150 గజాల లోపు ఉన్నవారు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రోత్ కారిడార్ ఉన్న చోట్ల ల్యాండ్ ధరలు రివైజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అండ్ స్టాంప్స్ విభాగంలో ఎక్కువ ఫిర్యాదు వచ్చినట్లు అనగాని తెలిపారు. ఈ శాఖలపై ప్రాంతాల వారీగా సమీక్షించనున్నట్లు వెల్లడించారు.


గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. రీసర్వే కార్యక్రమంతో ప్రజలకు ఏమాత్రం మంచి జరగలేదని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే ఇప్పుడు రీసర్వే చేయబోతున్నట్లు అనగాని వెల్లడించారు. 200 ఎకరాలకు ఒక టీమ్ చొప్పున ఏర్పాటు చేసి తిరిగి సర్వే చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి పట్టాదారుడికి మూడుసార్లు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 20న జరిగే రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. భూమిపై హక్కు వస్తుందనే ఆశ ప్రజల్లో కనిపిస్తోందని మంత్రి అనగాని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: కేంద్ర మంత్రి నిర్మలను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల.. విషయం ఏంటంటే..

Kolusu Partha Sarathy: నూజివీడు ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి..

Updated Date - Dec 17 , 2024 | 09:42 PM