Lanka Dinakar: ఏందయ్యా జగనయ్యా.. ఏపీని గంజా ప్రదేశ్‌గా మార్చేశావ్ కదా!
ABN, Publish Date - Mar 22 , 2024 | 09:38 AM
Andhrapradesh: బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ పట్టుబడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. విశాఖలో డ్రగ్స్ పట్టుబడటంపై ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ‘‘డ్రగ్ మరియు గంజాప్రదేశ్’’ గా మార్చిన ఘనత జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు.
అమరావతి, మార్చి 22: బ్రెజిల్ నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ (Drugs) పట్టుబడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. విశాఖలో డ్రగ్స్ పట్టుబడటంపై ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ (AP BJP Leader Lanka Dinakar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ‘‘డ్రగ్ మరియు గంజాప్రదేశ్’’ గా మార్చిన ఘనత జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల మాటేమో కానీ మూడు ప్రాంతాలను డ్రగ్స్, గంజా, మద్యం రాజధానులుగా మార్చే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యలు చేశారు. గతంలో విజయవాడ అడ్రస్‌తో వేల కోట్ల విలువైన డ్రగ్స్ వస్తే, నేడు వైజాగ్ పోర్టుకి నేరుగా లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంటైనర్ తెరవకుండా వత్తిడి చేసిన నాయకులు, అధికారులపైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనాలో యువత భవిష్యత్తు దెబ్బతీసే అరాచకాలకు అంతు లేకుండా పోయిందని లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.
Modi Vs Kejriwal: దశాబ్దం నుంచి ఆధిపత్య పోరు.. ఇక ముగిసినట్టేనా!
ఇదీ జరిగిందీ...
విశాఖ కేంద్రంగా డ్రగ్స్ రవాణా తీవ్ర కలకలం రేపింది. లాసన్స్‌బే కాలనీలో గల సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ బ్రెజిల్ నుంచి ‘‘డ్రై ఈస్ట్’’ పేరుతో ఒక కంటెయినర్ తెప్పించుకోగా అందులో కొకైన్ ఉందని నిర్ధారణ అయ్యింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్‌పోల్ నుంచి ఈ నెల 18న సీబీఐకి సమాచారం వచ్చింది. అప్పటికి రెండు రోజుల ముందే ఆ నౌక ఇక్కడి కంటెయినర్ టెర్మినల్‌కు చేరింది. సీబీఐ అధికారులు మరుసటిరోజే (19వ తేదీ మంగళవారం) లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటెయినర్‌పై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. విజిలెన్స్ అధికారులను కూడా తీసుకువెళ్లారు. సంధ్య సంస్థ తరపున వైస్ ప్రెసిడెంట్ ఆర్‌వీఎల్‌ఎన్ గిరిధర్, ఆయనతో పాటు తోడుగా పూరీ శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్‌కుమార్‌లు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందరి ముందు కంటెయినర్‌ని తెరిచారు. అందులో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచులను 20 పాలెట్లలో సర్దారు. ఒక్కో పాలెట్ నుంచి ఒక సంచిని సీబీఐ అధికారులు పరీక్షించారు.
Hemant Soren: మనీ లాండరింగ్ కేసు.. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
అయితే అప్పటికే అక్కడికి వచ్చిన పోర్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరికొందరు అధికారులు సీబీఐ అధికారులు తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు. వైసీపీ పెద్దల సూచనతో ఆగమేఘాలపై అక్కడికి వచ్చిన ఏపీ అధికారులు విచారణ ముందుకు సాగకూడదని విఫలయత్నం చేశారు. అయితే సీబీఐ అధికారులు ఇవేమీ వినకుండా.. తమ వెంట తీసుకువెళ్లిన కిట్ల ద్వారా 20 పాలెట్లను పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం ‘కొకైన్’ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TDP: నేడు టీడీపీ మూడో జాబితా విడుదల...!
Hyderabad: కత్తులు, తుపాకీతో హడలెత్తించినా ధైర్యంగా మడతబెట్టేసి..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 10:50 AM