ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మళ్లీ నేనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతా...

ABN, Publish Date - Jul 11 , 2024 | 02:29 PM

Andhrapradesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘వాజపేయి ప్రభుత్వంలో నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను. మళ్ళీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడతాను’’ అని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu

విశాఖపట్నం, జూలై 11: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై (Visakha Steel Plant) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘వాజపేయి ప్రభుత్వంలో నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను. మళ్ళీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడతాను’’ అని స్పష్టం చేశారు. వైసీపీ (YSRCP) అబ్దదాలు వింటే నష్టం జరుగుతుందన్నారు. కరుడ గట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖను దోచుకున్నారని ఆరోపించారు. వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. రోడ్లు ఆద్వాన్నంగా ఉన్నాయని... ఆ గొయ్యిలు పెట్టిన వారిని ఆ గోతులో ఉంచాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా


అక్కడ కిమ్.. ఇక్కడ జిమ్..

అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా (Former CM YS Jaganmohan Reddy) సీఎం విమర్శలు గుప్పించారు. ‘‘నార్త్ కొరియా కిమ్ ఉంటే, ఇక్కడ జిమ్ ఉన్నాడు. జగన్ వస్తే చెట్లు కొట్టే వారు, రోడ్డుకు పరదాలు కట్టారు.. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. కార్పేట్లు వద్దు.. నేను మట్టిలోనే తిరుగుతాను. ప్రతి పైసా పొదుపుగా ఖర్చు చేస్తాను.. ప్రజల కోసం వాడుతాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా

Mothkupalli: పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే...

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 03:28 PM

Advertising
Advertising
<