CM Ramesh: ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేసిన వదిలిపెట్టం
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:12 PM
ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
విశాఖపట్నం: ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్ రాజీనామాలతో యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ సమయంలో చేసిన అక్రమాలపై, చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఈ రోజు(శనివారం) ఏయూలో ఎంపీ సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి వంశీకృష్ణ యాదవ్ రాజీనామాలతో యూనివర్సిటీలో పర్యటించారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. న్యాయపరమైన విచారణ చేయిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదని అన్నారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహలు ఉండకూడదన్నారు. అధ్యాపకులు,విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోని ముందుకు వెళ్తామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.
ప్రసాద్ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారు: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
దేశంలో ఎక్కడలేని విధంగా స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించారని భీమీలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏయూలో ప్రసాద్ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రసాద్ రెడ్డి వలన ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏయూకు పూర్వవైభవం తీసుకువస్తామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Updated Date - Jun 29 , 2024 | 03:12 PM