ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: ‘నా తలరాత రాసేది జగనే’.. ఎందుకీ పరిస్థితి అమర్నాథ్!

ABN, Publish Date - Feb 04 , 2024 | 05:53 PM

‘‘అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్(CM Jagan) రాస్తారని... ఆయనకు నేను నమ్మిన బంటునని.. అతను తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా నేను కట్టుబడి ఉంటా’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం: ‘‘అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్(CM Jagan) రాస్తారు’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌కు నేను నమ్మిన బంటును.. ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటాను. వైసీపీ(YSRCP) మళ్లీ అధికారంలోకి రావాలి.. జగన్ సీఎం కావాలి.. అవసరం అయితే ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధం. జగన్‌ను అధికారంలోకి తేవడం చారిత్రాత్మక అవసరం. జగన్ ఒక అర్జునుడు... ఆయన సైన్యంలో నేను ఒక సైనికుడిని మాత్రమే. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ నాకు చిన్న వయస్సులో ఇచ్చారు’’ అని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మంత్రి మాటలు విన్న సొంత పార్టీ నేతలు, నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు అయ్యో పాపం అమర్.. ఈయన పరిస్థితి ఎక్కడికొచ్చిందో చూడండి అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

అది చాలా సెన్సిటివ్ విషయం

తహసీల్దార్ రమణయ్య హత్య ఘటన దురదృష్టకరమని.. తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆదివారం నాడు విశాఖలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... ఇది సెన్సిటివ్ విషయం.. పోలీసులు కేసును విచారణ చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీతో తప్పితే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పార్టీ ఎవరిని వదులుకోదు.. కానీ ఎవరైనా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు. రైల్వే జోన్‌కు సంబంధించిన భూమిని కేంద్రానికి ఇచ్చామని స్పష్టం చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు ఉండవని తేల్చిచెప్పారు.ఏపీను నాశనం చేయవద్దని... ప్రతిపక్ష నేతలు అవాస్తవాలు మాట్లాడవద్దని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.

Updated Date - Feb 04 , 2024 | 06:20 PM

Advertising
Advertising