AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Oct 06 , 2024 | 11:52 AM
వైసీపీ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
విశాఖపట్నం: జగన్ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. వైసీపీ నేత ఆడారి ఆనంద్‌ను విశాఖ డెయిరీ చైర్మన్ పదవి నుంచి తప్పించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడారి కబంధ హస్తాల్లో పాడి రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవాళ(ఆదివారం) విశాఖలోని జనసేన కార్యాలయంలో మూర్తి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ అక్రమాలపై సీబీఐ, ఈడీ, ఇన్ కంటాక్స్ విచారణ జరిపించాలని చెప్పారు. ఆడారి ఆనంద్‌కి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. 20 ఎకరాల ట్రస్టు భూమిని వైసీపీ నేత ఆడారి ఆనంద్ కుటుంబం కొట్టేసిందని అన్నారు.
ఐస్ క్రీం పేరుతో డబ్బులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ డెయిరీ సీఈవో అండ్ ఎండీ ఎస్వీ రమణ నెలకు రూ.10 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్నారని అన్నారు. ఆడారి ఆనంద్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ డైయిరీలో పలు అక్రమాలు జరిగినట్లు చెప్పారు. విశాఖ డెయిరీలో డైరెక్టర్స్ అందరూ ఆడారి కుటుంబ సభ్యులు, సన్నిహితులేనని ఆరోపించారు. విశాఖ డైయిరీ పాలకవర్గాన్ని రద్దుచేయాలని కోరారు. ఎన్నిక ముందు విశాఖ డెయిరీ డబ్బులు రూ. 200 కోట్లను మాజీ సీఎం జగన్‌కి ఇచ్చారని ఆరోపించారు. డైయిరీని కావాలని నష్టాలపాలు చేశారన్నారు.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని మూర్తి యాదవ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..
బరితెగించిన స్మగ్లర్స్.. పోలీసులపై హత్యాయత్నం
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Updated Date - Oct 06 , 2024 | 01:17 PM