ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: కూటమి గెలవడానికి కారణం ఇదే.. కేఏ పాల్ సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Jun 05 , 2024 | 08:25 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపిస్తున్నారు. ఓట్లు గల్లంతయ్యాయని.. ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..

విశాఖపట్నం, జూన్ 05: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపిస్తున్నారు. ఓట్లు గల్లంతయ్యాయని.. ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. పల్లా శ్రీనివాస్‌కి లక్ష మెజారిటీ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన ఓట్లు కూడా పల్లాకు పడ్డాయని ఆరోపించారు. ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకుంటానని అన్నారు. దేశంలో హేమాహేమీ నాయకులకంటే భరత్‌కు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారాయన.


అమెరికాలో మాస్క్‌లు వేసుకుని గజ దొంగలు దొంగతనం చేస్తారని.. ఇక్కడ మాత్రం గజ దొంగలు తెల్ల బట్టలు కాషాయ వస్త్రాల్లో వచ్చి ఓట్లు దొంగతనం చేశారని పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చిత్తుగా ఓడి 240 సీట్లు గెలుచుకుందన్నారు. నాడు 151 సీట్లలో గెలిపించిన ప్రజలే.. నేడు 110 అయినా ఇస్తారన్న ధీమాతోనే జగన్ లండన్ వెళ్లాడని.. కానీ, 10 సీట్లకు పరిమితం అయ్యాడని వ్యాఖ్యానించారు. తాను గెలిస్తే నోరు విప్పలేనని.. అందుకే దేవుడు ఇలా నిర్ణయించాడని నమ్ముతున్నానని అన్నారు.


చంద్రబాబును ప్రధాని చేసే బాధ్యత తనది పాల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి చిత్త శుద్ది ఉంటే.. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందన్నారు. పవన్ కల్యాణ్‌ది గెలుపు అనరు.. చరిత్రలో ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఉండేవారు. ఫాబ్రికేటెడ్ ఈవీఎం టాంపరింగ్ ద్వారా కూటమి గెలిచింది. దేశ ద్రోహులు దేవుడి ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. కూటమి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు? అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని పాల్ ప్రశ్నించారు. ప్రజల కోసం ఏ పార్టీతోనైనా పని చేయడానికి తాను సిద్ధం అని ప్రకటించారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 08:25 PM

Advertising
Advertising