ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్ష

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:35 PM

Andhrapradesh: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత... అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆయా జిల్లాలో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Minister Vangalapudi Anita

విశాఖపట్నం, జూలై 20: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anita)... అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆయా జిల్లాలో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు వరద ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎప్ బలగాలు రంగంలోకి దిగాయి.

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!


ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతలపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చింతూరు ఏజెన్సీలో వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్బిణీ స్త్రీలు, రోగులను సమీప పీహెచ్‌లకు తరలించాలన్నారు. వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి అనిత సమీక్ష నిర్వహిస్తున్నారు.

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!


పొంగుతున్న వాగులు.. వంకలు

ఏపీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నారు. వర్షాలకు వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల ప్రధాన రహదారిపై జల్లేరు గూడెంవాగు పొంగి ప్రవహిస్తోంది.

YS Jagan: వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ


ఉమ్మడివరం వద్ద వాగు ఉధృతికి వంతెన సైడ్‌ బర్మ్‌ కోతకు గురైంది. ఎటపాకలో పత్తి, వరి నారు నీట మునిగింది. కూనవరం మండలంలో శబరి, సీలేరు, గోదావరి నదుల సంగమం ఉధృతి దాల్చింది. అల్లూరి జిల్లాలో గత రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాలున్న చింతూరు డివిజన్‌ పరిధిలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా చెరువులు, పంట పొలాల్లో నీరుచేరింది.


ఇవి కూడా చదవండి...

Kotamreddy: ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు

Nimmala: చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 03:35 PM

Advertising
Advertising
<