ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ABN, Publish Date - Jul 01 , 2024 | 07:28 PM

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. విశాఖలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

Mandipalli Ramprasad Reddy

విశాఖపట్నం: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. విశాఖలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. విశాఖలోని మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..


లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా సిబ్బంది సేవలు అందిస్తున్నారన్నారు. ఆర్టీసీపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. సంస్థలో మరింత పురోగతి సాధిద్దామని తెలిపారు. కార్మికుడు - ప్రయాణికుడు రెండు కళ్లు లాంటి వారని చెప్పారు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే సంస్థ బాగుంటుందని అన్నారు. నష్టాలు వచ్చాయని వదిలేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.


ఏపీ ఆర్టీసీకి వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. ఆస్తులను అమ్ముకోవడం గత ప్రభుత్వం పనితనమని విమర్శించారు. కార్గో, కొరియర్ సర్వీస్‌లు ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో అన్ని ఎలక్రిక్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాము వెనుకడుగు వేయమని కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేరస్తామని హామీ ఇచ్చారు. 1400 కొత్త బస్సులు ఏపీకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లు అందరికీ అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. ఒక్కో జోన్‌లో రెండు నెలలకు ఒకసారి పర్యటిస్తానని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Lav Krishnadevarayalu ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వాలి

CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 09:40 PM

Advertising
Advertising