ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. రేపే తుది గడువు..

ABN, Publish Date - Aug 12 , 2024 | 10:43 AM

Andhrapradesh: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 13తో ముగియనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి రెడీగా ఉంది. బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెర పైకి వచ్చింది. ఈరోజు అభ్యర్థి పేరును కూటమి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Visakhapatnam

విశాఖపట్నం, ఆగస్టు 12: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు (MLC by-election of Visakha local bodies) నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 13తో ముగియనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి రెడీగా ఉంది. బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెర పైకి వచ్చింది. ఈరోజు అభ్యర్థి పేరును కూటమి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవపు వైసీపీ అధిష్టానం ఇప్పటికే తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను (Former Minister Botsa Satyanarayana) ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు మీద ట్విస్టులు..


కాగా... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని హోటల్లో గత శనివారం సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ భేటీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని 12వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పారు. ఈ క్రమంలో అందరి సహకారం కావాలని కోరుతున్నానన్నారు.

KTR: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు


కాగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో.. వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిణ భారత యాత్రకు పంపుతున్నారు. ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందినవారిని బెంగళూరు తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ కుటుంబసభ్యులతో గత గురువారం తాడేపల్లి నివాసానికి తరలివచ్చారు.


ఇవి కూడా చదవండి..

Congress: నకిరేకల్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. అవిశ్వాసంపై ఉత్కంఠత..!!

Vizag MLC Election: కూటమి అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ!.. ఈ నెల 13తో ముగియనున్న నామినేషన్ల గడువు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 12:42 PM

Advertising
Advertising
<