AP News: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత మాది: పల్లా శ్రీనివాసరావు
ABN, Publish Date - Sep 14 , 2024 | 06:54 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని.. అలా చేయకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ప్లాంట్ పరిరక్షణ చేయకపోతే తాను పదవులకు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్షలో కూర్చుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత తమదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు(శనివారం) పల్లా శ్రీనివాసరావు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని.. అలా చేయకపోతే తాను తన పదవులకు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ నిరాహార దీక్షలో కూర్చుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ALSO READ::Pawan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
సెయిల్‌లో విలీనంపై భిన్నాభిప్రాయాలు: ఎంపీ శ్రీ భరత్
గాజువాకలో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు భరోసాగా ఉంటామని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) ఎంపీ శ్రీ భరత్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ విషయం గురించి చెప్పానని గుర్తుచేశారు. కుమారస్వామి విశాఖ ప్లాంట్ సందర్శనలో ఈ ప్లాంట్ కోసం మంచి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సెయిల్‌లో విలీనంపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్‌లో జరిగే మార్పులపై ఎలాంటి భయం పెట్టుకోవద్దని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు.
ALSO READ:Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..
కేంద్ర ప్రభుత్వ సహాయం పొందిన తర్వాత పూర్తిగా పని చేసి ఫలితం ఇవ్వాలని కార్మికులను కోరారు. ముడి సరుకుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవాలని.. అంత వరకు కార్మికులు సమన్వయం పాటించాలని అన్నారు. ఏపీకి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కి న్యాయం చేయటానికి తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలంటే కార్మికుల కృషి చాలా ముఖ్యమని అన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్‌కు సహాయం చేయటానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించకపోతే తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీభరత్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..
Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 14 , 2024 | 07:08 PM