ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rammohan Naidu: ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి..

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:48 PM

విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చి ఫ్లైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.

విశాఖ: విజయవాడ- విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమాన సర్వీసులు ప్రారంభించడం బహుశా ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఈ రెండు నగరాల మధ్య సర్వీసులు పెంచాలని చాలా మంది కోరారని, ప్రజల కోరికకు అనుగుణంగా సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పుకొచ్చారు.


కొత్త సర్వీసులు ప్రారంభం..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. " విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త సర్వీసులు రావడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల ఫ్లైట్ టికెట్లు ధరలు తగ్గుతాయి. ఇకపై విశాఖ- విజయవాడ మధ్య రూ.3వేలకే టికెట్ దొరికే అవకాశం ఉంది. విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ నిర్ణయంతో ఉన్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ ఎంతో అవసరం. విశాఖ- గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తా. విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు వచ్చేలా కృషి చేస్తా. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నాం.


అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలు..

ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని భోగాపురంలో పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని కొత్త ప్రాంతాలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో విమానయానరంగం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నగరానికి టీసీఎస్‌ను మంత్రి నారా లోకేశ్ తీసువచ్చారు. విశాఖను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్ కార్గోపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే కొన్ని సమావేశాలు నిర్వహించాం. మరికొన్ని రోజుల్లో అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం.


బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు..

విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోంది. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. విచారణ తర్వాత వీటి వెనక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుంది. బాంబు బెదిరింపులను అరికట్టడానికి ట్విట్టర్, లా ఏజెన్సీలు, ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటున్నాం. సివిల్ ఏవియేషన్‌లో ఉన్న రెండు చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నాం. నూతన చట్టం తీసుకువచ్చి అలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెదిరింపులకు పాల్పడుతున్న వారికి విమాన ప్రయాణం నిషేధించాలని ఆలోచన చేస్తున్నాం. విజయవాడ వేదికగా ఇటీవల డ్రోన్ షో నిర్వహించాం. ఈ డ్రోన్ షో ఐదు రికార్డులు నెలకొల్పింది. ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాలు డ్రోన్ సిటీ కోసం కేటాయించాం" అని చెప్పారు.

Updated Date - Oct 27 , 2024 | 01:51 PM