ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: ఇకపై రిషికేశ్‌ తపస్సులోనే ఉంటా: స్వరూపానందేంద్ర స్వామి..

ABN, Publish Date - Nov 26 , 2024 | 07:54 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Swamy) కోరారు.

Swaroopanandendra Swamy

విశాఖ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Swamy) కోరారు. ఈ మేరకు గన్ మ్యాన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ అందజేశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రతా, శ్రేయస్సు కోసం ప్రస్తుత, మునుపటి ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావించటంతో తనకు కల్పించిన ఎక్స్ కేటగిరీ వెనక్కి తీసుకోవాలని శారదాపీఠం స్వరూపానందేంద్రస్వామి కోరారు.


శారదా పీఠానికి షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..

కాగా, శారదా పీఠానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల గట్టి షాక్‌ ఇచ్చింది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత వైసీపీ ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ అక్టోబర్ 24న ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్‌ రోడ్డులో కొత్తవలస వద్ద సుమారు రూ.225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కేవలం రూ.15 లక్షలకు (ఎకరా రూ.లక్షకు) జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. అక్కడ ఎకరా రిజిస్ర్టేషన్‌ విలువే రూ.2 కోట్లు వరకూ ఉందని జిల్లా యంత్రాంగం చెప్పినా అప్పటి ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. అంతేగాకుండా పీఠానికి కొండపై కేటాయించిన భూమికి వీఎంఆర్‌డీఎ రెండు కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టింది.


ఇదిలా ఉండగా.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించడంతోపాటు వేద పాఠశాల నిర్వహణ ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి తీసుకున్న పీఠం.. దానిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటామని అప్పటి పాలకులకు కోరగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. అక్కడ ఎనిమిది అంతస్థులతో బోర్డింగ్‌ హౌస్‌ పేరుతో హోటల్‌ నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా జీవో ఇచ్చేసింది. శారదా పీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల నివేదిక తెప్పించుకుంది. దానిని పరిశీలించిన అనంతరం చివరకు భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - Nov 26 , 2024 | 08:03 AM