Pallasrinivas: అచ్యుతాపురం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నేత
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:57 AM
Andhrapradesh: అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్‌కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 24: అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Former CM YS Jagan) చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (TDP state president Palla Srinivas) తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్‌కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు. గతంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని అందుకే ప్రమాదానికి కారణమని చెప్పుకొచ్చారు.
Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?
జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. శవ రాజకీయాల మీద పుట్టి... హత్య రాజకీయాల మీద పెరిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి హావబావాలు చూస్తే, ఎలా ఉన్నాయో ప్రజలందరూ చూశారన్నారు. బాధితులతో నవ్వుతూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ ఇప్పటికైనా బాధిత కుటుంబాల పట్ల వారికి రక్షణగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్‌ను కూడా డైవర్ట్ చేశారన్నారు. టీడీపీ ఎప్పుడు బాధితుల పక్షాన అండగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.
పరామర్శకు వచ్చి గొప్పలు..
కాగా.. నిన్న(శుక్రవారం) అనకాపల్లిలో అచ్యుతాపురం బాధితుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన గురించి గొప్పగా చెప్పుకోవడంతో పాటు రాజకీయ విమర్శలు చేయడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. బాధితులకు 15 రోజుల్లో పరిహారం అందకుంటే తానే వచ్చి ధర్నా చేస్తానంటూ పదే పదే చెప్పారు. తానొచ్చి ధర్నా చేస్తానంటే చంద్రబాబు భయపడతారంటూ డప్పు కొట్టుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తుకు తెస్తూ తానప్పుడు రూ.కోటి పరిహారం ప్రకటించానంటూ ఘనంగా చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక వైసీపీ మహిళా నేత చప్పట్లు కొట్టారు. వెనుక ఉన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆమెను వారించాల్సి వచ్చింది. ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్న బాధితుల ఎదుట గొప్పలు చెప్పుకోవడం అవసరమా? అన్న విమర్శలు వినపడ్డాయి.
ఇవి కూడా చదవండి...
విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి
Pinnelli: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. హడావుడిగా మాచర్లకు పయనం
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 24 , 2024 | 12:25 PM