AP Politics: రాజకీయ విలువలకు ప్రాధాన్యత.. చంద్రబాబు నిర్ణయంతో బొత్సకు కలిసొచ్చిన అదృష్టం..
ABN, Publish Date - Aug 17 , 2024 | 10:11 AM
అధికారం ఉంటే చాలు ఏదైనా చేయ్యొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో సానుకూలంశాలు ఉంటాయి.
అధికారం ఉంటే చాలు ఏదైనా చేయ్యొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో సానుకూలంశాలు ఉంటాయి. ఎంతటి నాయకుడినైనా తమవైపు తిప్పుకునే శక్తి అధికారం అనే నాలుగు అక్షరాలకు ఉంటుంది. ఏపీలో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసింది అదే. తమకు అధికారం ఉందనే అహంకారంతో నిబంధనలు పక్కకు పెట్టి, రాజకీయ విలువలను పాటించకుండా కేవలం అధికారం కోసం తప్పులపై తప్పులు చేసింది. అప్పట్లో విపక్ష నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. పక్క పార్టీ నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నింది. ఏకంగా టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండకూడదనే కుట్రకు తెరలేపినా.. ఆ విషయంలో ఫెయిల్ అయింది. కానీ నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో విలువలను పాటించాలని, పదవులు ఉంటాయి.. పోతాయి.. మనం నెలకొల్పిన సంప్రదాయాలే భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల పరిధిలో పార్టీ శ్రేణులు నష్టపోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు. పార్టీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. పోటీకి నిరాకరించి రాజకీయ విలువలను పాటించారు.
పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్!
గెలుపు అవకాశాలు ఉన్నా..
వాస్తవానికి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తిబలం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్నా గెలిచే అవకాశాలు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో.. చాలామంది వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ పరిధిలో కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. వారిని పార్టీలో చేర్చుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టకాలంలో పార్టీకోసం పనిచేసిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోలవరానికి.. త్వరగా నిధులివ్వండి
ముందుచూపుతోనే..
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిని పోటీకిపెడితే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. తాము కూటమి అభ్యర్థికి ఓటు వేస్తామంటూ ఎంతోమంది సంకేతాలు ఇచ్చారు. మరోవైపు జిల్లాలోని పార్టీ శ్రేణులు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని, తమకు టికెట్ ఇవ్వాలంటూ ఎంతో మంది ముందుకు వచ్చారు. అయినప్పటికీ భవిష్యత్తులో పార్టీ క్యాడర్‌కు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవికి పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దించలేనట్లు తెలుస్తోంది.
మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్ వేటు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Aug 17 , 2024 | 10:37 AM