Share News

తారాబు జలపాత సౌందర్యం

ABN , Publish Date - Jan 02 , 2024 | 12:14 AM

ఎత్తైన గిరుల పైనుంచి పాల నురగలా జలపాత సోయగాన్ని చూసేందుకు పర్యాటకులు సోమవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు.

తారాబు జలపాత సౌందర్యం
తారాబు జలపాతం వద్ద పర్యాటకులు

ముంచంగిపుట్టు, జనవరి 1: ఎత్తైన గిరుల పైనుంచి పాల నురగలా జలపాత సోయగాన్ని చూసేందుకు పర్యాటకులు సోమవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు ప్రాంతంలో గల గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని తారాబు సమీపంలో ప్రవహిస్తున్న ఈ జలపాతం వద్ద కొత్త సంవత్సరం సందర్భంగా సందడి నెలకొంది. న్యూ ఇయర్‌ వేడుకలను జలపాతం వద్ద చేసుకునేందుకు ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల నుంచి పర్యాటకులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు.

Updated Date - Jan 02 , 2024 | 12:14 AM