ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anitha: హ్యాండ్లూమ్ శారీ వాక్ ప్రారంభించిన హోంమంత్రి అనిత..

ABN, Publish Date - Aug 04 , 2024 | 10:16 AM

ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన "హ్యాండ్లూమ్ శారీ వాక్"ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో వెయ్యి మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది.

విశాఖ: ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన "హ్యాండ్లూమ్ శారీ వాక్"ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ప్రారంభించారు. కార్యక్రమంలో వెయ్యి మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది.


ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. "చీరకట్టడం అనేది మనకు అనాధిగా వస్తున్న సంప్రదాయం. భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది చీరకట్టు. అందులోనూ చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుంది. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి. చేనేత రంగం కష్టకాలంలో ఉంది. ఎన్డీయే ప్రభుత్వం తరఫున కార్మికులకు అండగా నిలబడతాం. చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చీర నేచేటప్పుడు వారి కష్టం ఎంతో ఉంటుంది. ఒక శారీ నేసేందుకు దాదాపుగా ఇరవై రోజులు పడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వారికి అన్ని పథకాలు అందిస్తాం. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతాం" అని చెప్పారు.

Updated Date - Aug 04 , 2024 | 10:25 AM

Advertising
Advertising
<