Botsa: సెజ్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం.. బొత్స కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 24 , 2024 | 04:52 PM
Andhrapradesh: అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఐదు లక్షలు ఇస్తున్నామని.. గాయపడిన వారికి లక్ష రూపాయలు సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
విశాఖపట్నం, ఆగస్టు 24: అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరపున ఐదు లక్షలు ఇస్తున్నామని.. గాయపడిన వారికి లక్ష రూపాయలు సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YSRCP Chief Jaganmohan Reddy) ఆదేశించారని తెలిపారు.
Viral: ఇదెక్కడి వింతరా దేవుడా! మూడు కాళ్ల కోడి.. షాక్‌లో జనాలు!
శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎసెన్షియ ఫార్మా ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించారని తెలిపారు. యజమాని రావడంలేదని, చెప్పారు కాబట్టి ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారన్నారు. యాజమాన్యం సహకరించ లేదంటే ప్రభుత్వం అసమర్థతగా భావించాలంటారా..ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి? ఎలా అరికట్టాలని ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన, మాటలు పక్కన పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోఉన్న నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?
‘‘నేను పరిశ్రమల శాఖ మినిస్టర్‌గా ఉన్నప్పుడే ఫార్మాసిటీ ఏర్పాటు చేశాం... సేఫ్టీ ఆడిట్ చేయలేదంటున్నారు. ఇప్పుడున్న సీఎస్ ఏ కదా గతంలో ఉన్న అధికారి.. చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి పక్కన పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. జరిగిన ఘటనపైన ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని వారి కుటుంబాలకి ఎప్పుడైనా చెప్పారా. ఎల్జి పాలిమర్స్ ఘటనపై, మంత్రులందరూ స్పందించారు పరామర్శించారు. గత ఐదు సంవత్సరాలుగా ఏం చేయలేదని విమర్శలు చేస్తున్నారు. బాధ్యతగా గుర్తెరిగి వ్యవహరించాలి అప్పుడు విమర్శలు చేయాలి. కేజీహెచ్‌కు వెళ్లి డిమాండ్ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి వచ్చారు. జిల్లా యంత్రాంగం మృతుల కుటుంబాల పట్ల సరిగా వ్యవహరించలేదు. పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం ముందు రూ.30 కోట్లు ఇచ్చి తర్వాత యాజమాన్యం నుంచి రికవరీ చేశారు. ఘటన పైన నిజాయితీ పరంగా, ఎంక్వయిరీ చేయాలి. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరాం. విమర్శలు ఆపండి బయట ప్రజల అసహ్యించుకుంటున్నారు. కూన ప్రసాద్ అనే వ్యక్తిపై దాడి చేసి చంపారు. దయచేసి హత్యా రాజకీయాలు ఆపండి’’ అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Aug 24 , 2024 | 05:55 PM