AP Govt: జగన్ సర్కార్ మరో కొత్త ఎత్తు
ABN, Publish Date - Mar 05 , 2024 | 03:50 PM
Andhrapradesh: రాష్ట్ర వ్యప్తంగా మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ఫెయిల్ అవడంతో జగన్ సర్కార్ మరో కొత్త ఎత్తు వేసింది. రేషన్ పంపిణీ వ్యవస్ధపై వాలంటీర్ నిఘా పెట్టేలా చర్యలు తీసుకుంది. ఆ వాహనాలు సరిగా వెళుతున్నాయే లేదో ఎన్నికలకు ముందు మూడు నెలలు నిఘా వేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, మార్చి 5: రాష్ట్ర వ్యప్తంగా మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ఫెయిల్ అవడంతో జగన్ సర్కార్ (Jagan Government) మరో కొత్త ఎత్తు వేసింది. రేషన్ పంపిణీ వ్యవస్ధపై (Ration Distribution) వాలంటీర్ నిఘా పెట్టేలా చర్యలు తీసుకుంది. ఆ వాహనాలు సరిగా వెళుతున్నాయే లేదో ఎన్నికలకు ముందు మూడు నెలలు నిఘా వేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి మెబైల్ వాహనాలలో రేషన్ సరఫరా విషయంలో విలేజ్, వార్డు వాలంటీర్లను కలుపుకుని పనిచేయాలని ఆదేశించింది. దీని కోసం ఒక్కొక్కరికి జనవరి నుంచి మార్చి వరకూ నెలకు రూ.500 అదనంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 2ను జారీ చేసిన వినయోగదారుల, పౌర సరఫరాల శాఖ ఈ నిధులను శాఖ అంతర్గత నిధుల నుంచి చెల్లించాలని ఆర్డర్స్ పాస్ చేసింది. మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరిగా అందకపోతే వెంటనే వాలంటీర్లు ఆ విషయాన్ని వీఆర్వో లేదా సివిల్ సప్లస్ డిప్యూటీ తహసిల్దార్లకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్సఫిషియో కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
CM Jagan: మరీ ఇంత కక్షా?.. మరోసారి రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్
TS News: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన.. ఎమ్మెల్సీ కవిత విమర్శలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 05 , 2024 | 03:50 PM