Modi Cabinet: లాస్ట్ మినిట్‌లో లక్కీఛాన్స్.. విధేయతకు దక్కిన పదవి..
ABN, Publish Date - Jun 09 , 2024 | 02:37 PM
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు. అవకాశం వస్తే ఎంపీగా పోటీచేస్తానన్నారు. 3 దశాబ్ధాలుగా పార్టీలోనే ఉంటూవచ్చారు. పదవుల కోసం వెంపర్లాడలేదు. చివరికి మోదీ 3.0 కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కింది. దేశంలో 543 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేంద్రమంత్రి మండలిలో గరిష్టంగా 81మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎంపీగా గెలవాలంటే ప్రజల మద్దతు కావాలి. కానీ కేబినెట్‌లో చోటు దక్కాలంటే మాత్రం అన్ని కలిసిరావాలి. ముఖ్యంగా లక్ ఉండాలి. ఆ లక్ ఉండటంతో లక్కీ ఛాన్స్ కొట్టేశారు నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆయనకు టికెట్ రావడమే పెద్ద విచిత్రం.. అలాంటిది మోదీ కేబినెట్ బెర్త్ లభించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయనడానికి వర్మ నిదర్శనమని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాసవర్మ గెలిచారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉంది. దీంతో ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం జరిగింది. కానీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటంతో ఆమెకు తొలి విడతలో మంత్రి పదవి దక్కలేదు. అనూహ్యంగా నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు మంత్రి పదవి లభించింది. వర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడంతో విధేయతకు దక్కిన పదవిగా బీజేపీ శ్రేణులు అభవర్ణిస్తున్నారు.
Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లోకి ఊహించని వ్యక్తులు.. సీనియర్లకు బిగ్ షాక్
30 ఏళ్లుగా..
భూపతిరాజు శ్రీనివాసవర్మ 36 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992-95 మధ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం మున్సిపాల్టీ వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి విజయం సాధించారు. తాజాగా మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పెరిగిన సంఖ్య..
తొలివిడతలో ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయి. చివరి నిమిషంలో తెలుగు రాష్ట్రాల నుంచి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరిగింది. దీంతో శ్రీనివాసవర్మకు అవకాశం దక్కింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో ముగ్గురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా ఇద్దరు బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Chandrababu : బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు
వర్మకు ఎందుకంటే..
ఏపీలో ముగ్గురు బీజేపీ ఎంపీలు గెలవగా.. వారిలో పురందేశ్వరి, సీఎం రమేష్ ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరినవాళ్లే. శ్రీనివాసవర్మ మొదటినుంచి అదేపార్టీలో కొనసాగుతూ వచ్చారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. దీంతో ఆర్‌ఎస్‌ఎస్ నేతల ఒత్తిడితోనే వర్మకు అవకాశం లభించిందనే చర్చ సాగుతోంది. 2014, 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీకి చెందిన ఎవరూ కేంద్రమంత్రివర్గంలో లేరు. 2014లో పొత్తులో భాగంగా ఇద్దరు ఎంపీలు గెలిచినా కేబినెట్‌లో చోటు దక్కలేదు. 2019లో బీజేపీ నుంచి ఎవరూ ఎంపీలుగా గెలవలేదు. ఈసారి మాత్రం కేంద్ర కేబినెట్‌లో ఏపీ నుంచి బీజేపీ ఎంపీకి అవకాశం కల్పించారు.
YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh and Latest Telugu News
Updated Date - Jun 09 , 2024 | 04:08 PM