Share News

కూటమి పొత్తుతో.. అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:58 PM

కూటమి పొత్తు.. ఎన్నికల వరకే కాదని నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

కూటమి పొత్తుతో.. అభివృద్ధికి కృషి
తణుకులో కూటమి నాయకుల సంఘీభావం

తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి

తణుకు, ఏప్రిల్‌ 3: కూటమి పొత్తు.. ఎన్నికల వరకే కాదని నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో పొత్తు తర్వాత మొదటిసారిగా మూడు పార్టీలు కలసి విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులను సమన్వయం చేసుకు ని ప్రచారం చేయడంతో పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. తర్వాత నామినేటెడ్‌ పదవుల్లో జనసేన, బీజేపీ నాయకులకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలోనే ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, తణుకు గడ్డపై కూటమి జెండా ఎగరేస్తామని వివరిం చారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ జనసేన, టీడీపీ రెండు పార్టీలు టికెట్లు ఆశించాయని, పొత్తులో టీడీపీకి పెద్దలు సీటు కేటాయిం చారని, దానిని అంతా గౌరవించాలన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ ఐతంపూడి శ్రీదేవి, టీడీపీ నాయకులు కలగర వెంకట కృష్ణ, బసవ రామకృష్ణ, పితాని మోహన్‌, ఆనాల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు ఆకేటి కాశీ, దాసం బాబ్జి, చిక్కాల వేణు, కొమ్మిరెడ్డి శ్రీనివాసుతోపాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు

పింఛన్ల పంపిణీపై వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. బుధవారం పట్టణంలో పలు వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లా డుతూ సచివాలయ సిబ్బందితో కేవలం ఒక్కరోజులోనే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పరిమి వెంకన్నబాబు, తోట సూర్యనా రాయణ, తిరుమల సుబ్బారావు, ఊట రామకృష్ణ, ఒమ్మి రాంబాబు, కడియా ల సూర్యనారాయణ, చిక్కాల వేణు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఆరిమిల్లి సతీమణి ప్రచారం

ఆరిమిల్లి రాధాకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి కృష్ణతులసి సజ్జాపురంలోని 28, 29 వార్డుల్లో బుధవారం ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి పెద్దల్ని, మహిళలను కలసి పథకాలపై వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణను, ఎంపీగా వర్మను గెలిపించాలని కోరారు.

ఫ ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ శ్రీ గణేష్‌ హోల్‌సేల్‌ పండ్ల వర్తక సంఘం, శ్రీశ్రీనివాసా రిటైల్‌ పండ్ల వర్తక సంఘం సభ్యులతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

టీడీపీ కూటమిని గెలిపించుకోవాలి : మంతెన సుష్మ

ఆకివీడు, ఏప్రిల్‌ 3: వైసీపీ పాలనలో పదేళ్ళు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే టీడీపీ కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే మంతెన రామరాజు సతీమణి సుష్మ అన్నారు. ఇంటింటికి రాంబాబు, టీడీపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పదో వార్డులో ఆమె ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పార్టీ మండల, పట్టణ అధ్యక్ష–కార్యదర్శులు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు, గంధం ఉమా, మాజీ సర్పంచ్‌ గొంట్లా గణపతి, చేబ్రోలు పెద్దిరాజు, శ్రీను, బచ్చు సరళాకుమారి, అజ్మల్‌, బొల్లా వీరశ్వేత, కిమిడి అరుణకుమారి, నేరెళ్ల ప్రసన్న, బత్తుల శ్యామల, ఎం.సత్యవతి, బొర్రా సుజాత, గవర లక్ష్మి, గుర్రాని నాగలక్ష్మి, గొడవర్తి మణికంఠ, ఇల్లాపు కృష్ణవేణి, వేగేశ్న రామరాజు తదితరులు ఉన్నారు.

కావాలనే పింఛన్ల ఆలస్యం

రానున్న ఎన్నికల్లో మరలా అధికారం చేపట్టేందుకే ఈ నెల పి ంఛన్లు సమయానికి అందచేయకుండా ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఎమ్మెలే ్య మంతెన రామరాజు సతీమణి సుష్మ అన్నారు. బుధవారం ప్రచారంలో భాగంగా అవ్వలకు పింఛన్లపై వివరించారు. ఖజానాలో డబ్బులు లేనందున దానిని ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ రుద్దుతున్నారని విమర్శించారు.

బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరగాలి

ఆచంట, ఏప్రిల్‌ 3 : వచ్చే ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పెదమల్లంలో మండల అధ్యక్షుడు ముచ్చర్ల నాగ సుబ్బారావు అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో సమన్వయం చేసుకుని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. కొత్త భాస్కర నాగభూ షణం, హరిశివరామకృష్ణ, రామిశెట్టి రామచంద్రరావు, దమ్మా రాం బాబు, బోడపాటి నాగమసేన్‌రావు, వేండ్ర సిద్ధయ్య, కాసుల సాయి, అందే బసవగణపతి, కోమటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నిమ్మల గెలుపు ఖాయం

పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 3 : ప్రజల కష్టసమయాల్లో ఆదుకునే నాయకుడైన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలుపు ఖాయమని టీడీపీ మండల నాయకులు అన్నారు. బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు కోడి విజయ భాస్కర్‌తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సేవా భావంతోనే తప్ప, డబ్బు, కులంతో ఎమ్మెల్యే కాలేరన్నారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా సేవలందించిన నిమ్మల రామానాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని గోపి డబ్బుతోనూ, ఒక సామాజిక వర్గం ఓట్లతోనూ ఎమ్మెల్యే కావాలను కోవడం అవివేకం అన్నారు. సీహెచ్‌ సహదేవుడు, మామిడి శెట్టి లలిత కుమారి, మల్లుల రవీంద్ర కుమార్‌, కట్టా రాజ్‌కుమార్‌, శీలం అశోక్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి : అంజిబాబు

భీమవరం రూరల్‌, ఏప్రిల్‌ 3 :వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిం దని భీమవరం జనసేన కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. గొల్లవానితిప్ప గ్రామంలో నిర్వహించిన జనసేన, టీడీపీ, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి వద్దనే సకాలంలో పింఛన్‌ సొమ్మును పంపిణీ చేయవచ్చని, అందుకు భిన్నంగా జగన్‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపాడని విమర్శించారు. బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ మాట్లాడుతూ కేంద్ర పథకాలను వైసీపీ సొంత పథకాలుగా ప్రచారం చేసుకొని రాష్ట్ర ప్రజలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ కూటమి విజయం తధ్యమన్నారు. జనసేన రాష్ట్ర నాయకులు వేగేశ్న కనకరాజుసూరి, పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పులపర్తి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి పాలనను అంతం చేయాలి

పెంటపాడు, మార్చి 3: వైసీపీ అవినీతి పాలనను అంతమొందించాలని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ కోరారు. పెంటపాడులో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జితో కలసి ఎన్నికల శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, తాగునీరు సరిగా రాక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారన్నారు. వలవల బాబ్జి మాట్లాడుతూ పింఛన్ల కు సొమ్ములు లేక ఆలస్యం చేసి ఆ తప్పును ప్రతిపక్షాలపై నెట్టేందుకు వైసీపీ నీచ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలు దారుణంగా మోసపోయారని వారికి రావల్సిన పథకాలన్నీ వైసీపీ రద్దు చేసిందన్నారు. కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబి, దత్తు ప్రసాద్‌, బండి పెద్దిరాజు, కసిరెడ్డి మధులత పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:58 PM