Crime News: వడ్డీ వ్యాపారి ధన దాహానికి వివాహిత బలి..
ABN, Publish Date - Aug 15 , 2024 | 04:29 PM
వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ వివాహిత బలై పోయింది. నలుగురిలో వడ్డీ వ్యాపారి చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
ఏలూరు: వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ వివాహిత బలై పోయింది. నలుగురిలో వడ్డీ వ్యాపారి చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నూజివీడు మండలం ముక్కొల్లుపాడు (Mukkollupadu) గ్రామానికి చెందిన సక్కు అనే వివాహిత స్థానికంగా ఉండే ఓ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పనులు లేక ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. అయితే అదే సమయంలో తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారి ఒత్తిడి చేశాడు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని కొన్ని రోజులు ఆగిన తర్వాత చెల్లిస్తానంటూ సక్కు ప్రాదేయపడింది.
అయితే ఆమె ఇంటికి వచ్చిన నిందితుడు నగదు చెల్లించాలంటూ హడావిడి చేశాడు. చుట్టుపక్కల వారు రావడంతో మరింత రెచ్చిపోయి నానా మాటలు అని అవమానించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సక్కు ఇంట్లో ఎవరూ లేని సమయంలోఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గోప్యంగా ఉంచిన గ్రామపెద్దలు రాజీ చేసేందుకు చర్చలు జరిపారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళ బలవన్మరణానికి పాల్పడడంతో వడ్డీ వ్యాపారిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి:
Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని
Updated Date - Aug 15 , 2024 | 04:34 PM