Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:13 AM
Andhrapradesh: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎంతటి అహంకారాన్ని చూపించారు... ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేయాలని శతవిధాలుగా యత్నిస్తూనే ఉన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 10: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ (YSRCP) నేతలు ఎంతటి అహంకారాన్ని చూపించారో... ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై (AP Govt) అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేయాలని శతవిధాలుగా యత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వైసీపీ నేత చేసిన పని జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.
AP Floods: ఏపీలో అంతకంతకూ పెరుగుతోన్న వరద నష్టం.. వివరాలివే..
ఏపార్టీ అయినా సరే తమ పార్టీ జెండా ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఆ జెండాకు అవమానం జరగకుండా చూసుకుంటారు. కానీ జనసేన పార్టీ జెండా పట్ల ఓ వైసీపీ నేత చేసిన పాడు పని చూస్తే ఛీ ఛీ అనకుండా ఉండలేము. జనసేన (Janasena) పార్టీ జెండాపై వైసీపీ నేత మూత్రం పోసి అవమానించాడు. విషయం తెలిసిన జనసైనికులు సదరు నేతపై భగ్గుమంటున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన పార్టీ జెండాను వైసీపీ నాయకుడు అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హర్ష ఈ పాడుపనికి పాల్పడ్డాడు.
Telangana Politics: తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా.. బీఆర్‌ఎస్ నేతల మాటల్లో నిజమెంత
ఆగిరిపల్లి సెంటర్‌లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ రివర్స్ వచ్చి రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేసిన స్థానిక జనసేన నాయకుని కారుపై ఉన్న పార్టీ జెండాపై హర్ష మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందాడు. వైసీపీ నాయకులు పలు రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆగ్రహావేశాలకు గురికాకుండా పోలీసులకు జనసేన పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవడంతో జిల్లాల వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మూకుమ్మడి ఫిర్యాదుల కార్యక్రమంను చేపట్టెందుకు జనసైనికులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైనా.. నిందుతుడిని కాపాడేందుకు కొందరు కూటమి నాయకులు రాజీ చర్చలకు దిగడాన్ని పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి
AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..
AP Flood: ఏలేరు వరద ఉధృతి.. 25 వేల ఎకరాలు నీట మునక
Read Latest AP News And Telugu News