ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కుతుందా.. రూల్స్ ఏమి చెబుతున్నాయి..?

ABN, Publish Date - Jun 27 , 2024 | 10:19 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందనే చర్చ ఇటీవల కాలంలో ఎక్కువుగా జరుగుతోంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎక్కువ సీట్లు కలిగిన పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది.

YSRCP and Janasena

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందనే చర్చ ఇటీవల కాలంలో ఎక్కువుగా జరుగుతోంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎక్కువ సీట్లు కలిగిన పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే శాసనసభ లేదా లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభించడం సంప్రదాయంగా వస్తోంది. పది శాతం సీట్లు సాధించాలనే కచ్చితమైన నిబంధన లేనప్పటికీ.. అదొక సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పది శాతం సీట్లు వస్తే మాత్రం కచ్చితంగా ప్రతిపక్ష హోదా లభిస్తుంది.

YS Jagan: డిజిటల్ కార్పొరేషన్ పేరుతో మాయ ప్రపంచం..!!


పది శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఈక్రమంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉండగా.. ప్రతిపక్ష హోదా లభించాలంటే కనీసం 18 సీట్లు గెలుపొందాలి. వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో తమకు పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే పది శాతం సీట్లు లేకపోవడం వల్ల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని శాసనసభ వ్యవహరాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు సాధించింది. నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందంటూ జగన్ చేసిన కామెంట్స్ గుర్తుచేస్తూ.. 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా లభిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి లేదనేది సుస్పష్టం.

జగన్‌ బొమ్మలున్న పాస్‌పుస్తకాలు వెనక్కి!


జనసేనకు..

జనసేన పార్టీ 21 శాసనసభ స్థానాల్లో పోటీచేసి 21 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా పొందేందుకు 18 సీట్లు వస్తే సరిపోతుంది. ఈ లెక్కల ప్రకారం జనసేనకు ప్రతిపక్ష హోదా లభించాలి. కానీ జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ప్రభుత్వంలో లేని పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందనేది నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు పది శాతం సీట్లు ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా లభించదు. దీంతో జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కదు. 16వ ఏపీ శాసనసభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండానే కొనసాగనుంది. ఒకవేళ స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి పది శాతం సీట్లు లేని పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

పిన్నెల్లికి హైకోర్టు షాక్‌


పొత్తులో ఉంటే..

ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభలో మొత్తం సీట్లలో 10 శాతం సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. అదికూడా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి పది శాతం గెలిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఒకవేళ పొత్తులో భాగంగా పోటీచేసి పది శాతం సీట్లలో గెలిస్తే కూటమిలోని భాగస్వామ్యపక్షాలు సైతం తమ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. పది శాతం సీట్లను గెలుచుకున్నప్పటికీ కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తే మాత్రం ప్రతిపక్ష హోదా దక్కదు. అది కూడా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అంచనావేస్తే వైసీపీ, జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేవు. దీంతో విపక్షాల్లో ఒక పార్టీగానే వైసీపీని పరిగణిస్తారు.


pension : పింఛన్‌ పెంపు ఉత్తర్వులు జారీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 27 , 2024 | 10:30 AM

Advertising
Advertising