ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yarlagadda Venkatarao: పార్టీ మారకుంటే గంజాయి కేసులో ఇరికిస్తారట.. ఇంత దుర్మార్గమా?

ABN, Publish Date - Mar 07 , 2024 | 01:51 PM

వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు కట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని ‌గన్నవరం టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు.

విజయవాడ: వైసీపీ (YCP) నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని ‌గన్నవరం టీడీపీ (TDP) ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao) పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు. పార్టీ మారకపోతే గంజాయి కేసులో ఇరికిస్తారట.. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని యార్లగడ్డ ప్రశ్నించారు. పోలీసులు చట్ట పరంగా పని‌చేయకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. రాజకీయాల్లో హింస ఉండకూడదనే మా అభిప్రాయమని యార్లగడ్డ పేర్కొన్నారు. మా మంచితనాన్ని చేతకానితనంగా చూడొద్దన్నారు.

YS Sharmila: జగన్, చంద్రబాబు, పవన్.. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే..

మేము దీక్ష చేసే చోట వంశీ (Vallabhaneni Vamsi)కి ఏం పని అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్నారు. తాను జగన్‌తో కలిసి నడిచానని.. అన్యాయం చేశారనే బయటకి వచ్చానన్నారు. పాము కన్నా వంశీ నైజం మరింత విషమని పేర్కొన్నారు. తన గెలుపు కోసం పని చేసిన వారిపైనే దాడులు, కేసులు పెట్టిస్తున్నాడని యార్లగడ్డ తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం ఖాయమన్నారు. మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వారి లెక్కలు సరి చేస్తామన్నారు. ఎన్నికలలో పోలీసులు మా‌పై దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మాపైకి వచ్చిన వారి మీద ఆత్మరక్షణ కోసం మేము ప్రతిదాడులు చేస్తామని యార్లగడ్డ హెచ్చరించారు.

Atchannaidu: ఆర్టీసీ ఎండీకి అచ్చెన్న హెచ్చరిక.. బస్సులు ఇవ్వకపోతే..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 01:51 PM

Advertising
Advertising