ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: తాడేపల్లి సీఎం కార్యాలయానికి వైసీపీ కీలక నేతలు.. కారణమిదే..?

ABN, Publish Date - Mar 18 , 2024 | 05:07 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో జగన్‌లో ఓకింత భయం మొదలైంది. ఈ కూటమిని ఎలా ఢీకొట్టాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో జగన్‌లో ఓకింత భయం మొదలైంది. ఈ కూటమిని ఎలా ఢీకొట్టాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ‘ప్రజాగళం’ సభ సూపర్ సక్సెస్‌గా నిలవడం.. ఈ సభలో జగన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధానంగా విమర్శలు గుప్పించడంతో వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. మోదీ రంగంలోకి దిగడంతో ఏపీలో వైసీపీ ఇక గెలవడం కష్టమేనని జగన్ రెడ్డి , ఆయన అనుచరుల్లో టెన్షన్ మొదలైంది. కూటమిని తన అంగబలంతో ఎలా ఢీకొట్టి అధికారంలోకి మరోసారి రావాలని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు తాడేపల్లి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను పిలిచి ఎన్నికలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ కీలక నేతలు ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిథున్ రెడ్డి, వై వీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలతో జగన్ భేటీ అయ్యారు. వీరితో పాటు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వచ్చారు.

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్

పిఠాపురంపై ప్రత్యేక దృష్టి

సీఎం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్నందున జన సమీకరణతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. నేతల విజయానికి ఎలాంటి వ్యూహాలు అవలంభించాలనే అనే దానిపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను న్యూట్రల్ చేయడం, తమ అభర్ధుల విజయావకాశాలు మెరుగు పరచడంపై సూచనలు చేస్తున్నారు. అభ్యర్థుల మార్పులు, చేర్పుల్లో భాగంగా పిఠాపురం సీటును వంగా గీతకు అధిష్ఠానం కేటాయించిన విషయం తెలిసిందే. అదే సీటునుంచి తాను పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే ప్రకటించారు. పవన్ పోటీ చేసే పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పవన్‌‌ను ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలి.. కాపు ఓట్లను తమ వైపునకు ఎలా తిప్పుకోవాలనే అంశాలపై కీలక నేతలతో జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Lanka Dinakar: వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 05:23 PM

Advertising
Advertising