ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ముస్లిం మహిళపై వైసీపీ నేత భార్య దాష్టీకం

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:36 AM

నంద్యాల జిల్లాలో గత నెల ముస్లిం యువకుడి హత్య ఘటన మరువకముందే.. మరో ముస్లిం మహిళపై వైసీపీకి చెందిన దంపతులు తన ప్రతాపాన్ని చూపారు.

రాత్రి నమాజ్‌ చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుర్భాషలు

దొంగతనం చేసేందుకు వచ్చావని మాటలతో అవమానం

మహిళ కుమారుడిపై చెప్పుతో దాడి.. నేత ఇంటిని

ముట్టడించిన ముస్లింలు.. వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి అరెస్టు

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఘటన

నందికొట్కూరు, ఏప్రిల్‌ 5: నంద్యాల జిల్లాలో గత నెల ముస్లిం యువకుడి హత్య ఘటన మరువకముందే.. మరో ముస్లిం మహిళపై వైసీపీకి చెందిన దంపతులు తన ప్రతాపాన్ని చూపారు. పవిత్ర రంజాన్‌ మాసంలో బడేరాత్‌ సందర్భంగా పట్టణంలోని సుబ్బారావుపేటకు చెందిన ఓ ముస్లిం మహిళ శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో మసీదులో తరావీహ్‌ నమాజ్‌ అనంతరం ఇంటికి బయలుదేరారు. నందికొట్కూరు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆ సమయంలో తన ఇంటి ముందు కూర్చొన్నారు. ఈ క్రమంలో బురఖాలో వెళ్తున్న మహిళ ఎవరో ఆరా తీయాలంటూ తన భార్యను పురమాయించారు. ఆమె ఆ మహిళ వద్దకు వెళ్లి ‘‘నువ్వెవరు?’’ అని ప్రశ్నించడంతో బడేరాత్‌ సందర్భంగా మసీదులో నమాజ్‌కు వెళ్లి వస్తున్నానంటూ సమాధానమిచ్చారు. అయితే, శ్రీనివాస రెడ్డి భార్య ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘‘ఈ సమయంలో ఏం నమాజ్‌ ఉంటుంది? నువ్వు దొంగతనం చేయడానికే వచ్చావ్‌. ముస్లింలను నమ్మకూడదు’’ అంటూ దుర్భాషలాడారు. మహిళ విలపిస్తూ తన కుటుం బసభ్యులకుసమాచారాన్ని అందిం చారు. దీంతో ఆమె భర్త, కుమారులు శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తన కుమారుడిని శ్రీనివాసరెడ్డి భార్య చెప్పుతో కొట్టారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని శ్రీనివాసరెడ్డి బెదిరించడంతో మసీదులో ఉన్న తమ బంధువులకు, మత పెద్దలకు బాధితులు సమాచారం అందించారు. ముస్లింలు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని టీడీపీ సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి జయసూర్య పరామర్శించారు.

Updated Date - Apr 06 , 2024 | 10:37 AM

Advertising
Advertising